Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారం

మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారం

by Rama
మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారం

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈవాళ, రేపు..డిప్యీటీ సీఎం పవన్ తో కలిసి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బరిలోకి దిగనున్నారు. మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించాలని భావిస్తోంది. దీంతో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంవీయే కూటమి తరుపున మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఎంవీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా క్యాంపెయిన్ చేయనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: