Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

by Rama
సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 9న జరిగే ముగింపు వేడుకలకు ఏఐసీసీ అధినేతలు సోనియా, రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీనీ ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణతల్లి విగ్రహావిష్కరణకు ఆమె స్పెషల్ గెస్ట్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ లీడర్లలోనూ వ్యక్తమవుతున్నది. గతేడాది డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ ముగ్గురు లీడర్లు హాజరయ్యారు. ప్రస్తుత వేడుకలకు సైతం వారిని స్టేట్‌కు ఆహ్వానించాలనే ప్రయత్నంలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.

సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ వేడుకను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. స్టాచ్యూను సోనియాగాంధీ చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత సెక్రటేరియట్ ఎదుట పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు కావాల్సిన స్థలం లేకపోవడంతో ట్యాంక్ బండ్ చుట్టూ ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆ వేదిక నుంచి సోనియా, రాహుల్, ప్రియాంకలతో మాట్లాడించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. అయితే సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల వల్ల రాష్ట్రానికి వస్తారో.. లేదోననే డిస్కషన్ సైతం పార్టీలో నడుస్తోంది. విజయోత్సవాలకు రావాలని సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించేందుకు రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
    కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
  • అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
    అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
  • శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
    శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్‌ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
  • ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
    ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: