Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

by Rama
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు. తాళాలు ఎవరో వేయలేదు.. స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు. కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది గడి పెట్టుకున్నారు. పది లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది మొహం చాటేశారు. కార్యాలయ సిబ్బంది గడి వేసుకోవడంతో ప్రజలు ఊసురుమంటూ వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోయినా… సిబ్బంది అందుబాటులో ఉన్నా… గడి పెట్టుకుని వ్యవహారాలు కొనసాగిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పగటి పూటే గడి పెట్టుకోవడంతో లోపల ఏదో జరుగుతోందని భావిస్తున్నారు. విషయం గమనించిన సీవీఆర్ న్యూస్ సిబ్బంది వీడియో తీయడంతో.. ఒక్కొక్కరుగా బయటకు రావడం కొసమెరుపు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019112
Total views : 89924

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.