Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home International డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్

డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్

by Rama
డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేసిన ట్రంప్

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆరోపించారు. రిపబ్లికన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని సరిచేసి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రయత్నిస్తానని వివరించారు. దీంతో ఏటా రెండుసార్లు టైమ్ ను సరిచేసుకునే ఇబ్బంది నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని, దేశంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ట్రంప్ వివరించారు

డే లైట్ సేవింగ్ టైమ్ అంటే..
అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. యూఎస్ఏలోని కొన్ని ప్రాంతాలు వివిధ టైమ్ జోన్ లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ‘డే లైట్ సేవింగ్ టైమ్’(డీఎస్ టీ). దీని ప్రకారం.. మార్చిలో పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉన్నపుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్ లో ఒక గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి రెండవ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
  • ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62200

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.