జాబ్ క్యాలెండర్ కింద త్వరలోనే డీఎస్సీ ప్రకటించనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వెనకబడిన ప్రాంతమైన కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విద్యా, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. సమగ్ర శిక్షా అభియాన్ పై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే ఉద్యోగులకు.. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గతంలో మూడు నెలలకోసారి జీతాలిచ్చేవారని, ఇప్పుడు ఒకటో తేదీనే ఇస్తున్నామని మంత్రి తెలిపారు. జీతాల పెంపు అంశాన్ని వచ్చే సమావేశంలో కేంద్రంతో చర్చిస్తామని వివరించారు. కర్నూలు ప్రాంతంలో అవసరమైన మేరకు సీజనల్ వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. యువగళం సందర్భంగా ఆదోని, ఆలూరు, మంత్రాలయం ఎంత వెనకబడి ఉన్నాయో ప్రత్యక్షంగా చూశానని అన్నారు. కర్నూలు ప్రాంతానికి వచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. డీఎస్సీలోనూ కర్నూలు జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశామని, అయినా ఉపాధ్యాయ.. విద్యార్థుల నిష్పత్తి తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కర్నూలులో క్లస్టర్ విశ్వవిద్యాలయానికి 139 కోట్లు మంజూరయ్యాయని.. అందులో రూసా కింద 55 కోట్లు ఖర్చయ్యాయని మంత్రి నారా లోకేశ్ వివరించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. క్లస్టర్ విశ్వవిద్యాలయ ఏర్పాటులో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి74.5 కోట్లు అవసరమని, వచ్చే విద్యా సంవత్సరంలో వాటిని మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు…
287
previous post




Total views : 92819