రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి 1400 కి.మీ మేర సాగిందన్నారు. నాడు ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని తాము అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అభివృద్ధిపైనే పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, పరస్పర గౌరవానికి ప్రతీక అని ఈ దేశానికి ఆదర్శంగా నిలబడేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పథకం అమలు చేవామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళలను పెట్రోలు బంకులకు యజమానులను చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చవద్దని ఆదేశాలు ఇచ్చిందని, 2027 మార్చి 31 వరకు వీటిలో మార్పులకు అవకాశం లేదన్నారు.
రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…
103





Total views : 62187