Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది…

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది…

by CVR NEWS

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో పీ అండ్ కే ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సెంట్రల్ కెబినెట్ సమావేశం జరింగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వనీకుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ పీ అండ్ కే ఎరువులకు రూ. 41,543 కోట్ల రాయితీకి కేబినెట్ ఆమోద ముద్రవేసిందని పేర్కొన్నారు. అలాగే రూ. 13 వేల కోట్లతోయజపుర మెట్రో ప్రాజెక్టు రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.

భారతదేశ ఇంధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనున్న రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈక్విటీ భాగస్వామ్యం మరియు ప్రాజెక్టు వ్యయ సవరణలపై స్పష్టతనిచ్చారు.ఈ రిఫైనరీలో వాణిజ్య కార్యకలాపాలు జూలై 2026 నుండి కార్యాకలాపాలు ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా అవతరించిందని మన ప్రస్తుత రిఫైనింగ్ సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం పేరుగుతుందని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026931
Total views : 151366

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.