Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

by CVR NEWS

ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు. కానీ మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం అని డిలిమిటేషన్‍కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లోక్‍సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

018655
Total views : 89103

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.