789
పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు కీలకమైన అంశాలపై వారు చర్చించారు. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలతోపాటు పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమైన వేళ వీరి సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.