Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Telangana జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

by CVR NEWS

తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్‌దే మళ్ళీ అధికారం.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత తనదే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, మరోసారి టీఆర్ఎస్ అనే పదాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా వ్యవస్థపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ హైడ్రా అనే వ్యవస్థనే ఎత్తిపారేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు. హైడ్రా బాధితులను ఆదుకుంటామని, మళ్ళీ గులాబీ జెండా ఎగరగానే పేదలకు అండగా నిలబడి వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలకే కేంద్రీకృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, నిర్ణయాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: