Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home International యాపిల్‌ నాయకత్వంలో భారీ మార్పులు

యాపిల్‌ నాయకత్వంలో భారీ మార్పులు

by CVR NEWS

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన నాయకత్వంలో భారీ మార్పులను ప్రకటించింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా చేశారు. ఆ టెక్ దిగ్గజ సంస్థకు గుడ్ బై చెప్పారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన బంధానికి ఇక తెరపడబోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ఐతే ఇప్పటివరకు సీఈవో స్థానంలో ఉన్న టిమ్‌..కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక ఆయన స్థానంలో జాన్ టెర్నస్ అపాయింట్ అయ్యారు. హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జాన్‌ టర్నెస్‌..సెప్టెంబర్‌ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. టెర్మస్ నియామకాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా యాపిల్ సీఈఓగా పని చేయడం తన జీవితంలో అద్భుత సందర్భమని, ఆ సంస్థతో సాగిన అతి గొప్ప ప్రయాణానికి తెరపడిందని వెల్లడించారు టిమ్ కుక్. టెర్నస్‌ సామర్థ్యాలను ప్రశంసించారు. ఓ అద్భుతమైన ఇంజినీర్ అని కితాబిచ్చారు. ఇంజినీరింగ్ మైండ్, ఇన్నోవేటివ్ సోల్‌తో కూడిన దూరదృష్టి గల నాయకుడిగా ప్రశంసించారు. టెర్మస్ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

స్టీవ్ జాబ్స్ మరణానికి ముందు 2011లో కుక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో ఆపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. మ్యూజిక్, ఐక్లౌడ్, టీవీ+ సేవలతో పాటు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి కీలక ఉత్పత్తుల వృద్ధి సాధించారు. సీఈఓ కాకముందు 1998లో కుక్ ఆపిల్‌లో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. అత్యంత సమర్థమైన గ్లోబల్ సప్లై చెయిన్‌ను నిర్మించి, అధిక లాభాలతో యాపిల్ వేగంగా ఎదగడానికి తోడ్పడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: