Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును 24గంటల్లో చేధించారు పోలీసులు.

అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును 24గంటల్లో చేధించారు పోలీసులు.

by CVR NEWS

అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును 24గంటల్లో చేధించారు పోలీసులు. నక్కపల్లి మండలం ముకుందరాజుపేటలో..ఓ ఇంట్లో15 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. 10 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లోనే ఛేదించారు. బాధితుడి బంధువు పాయకరావుపేట మండలం పెంటకోటకు చెందిన కొల్లి శ్రీనునే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు..అతని నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: