Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News బెంగళూరు: నటి రన్యారావుకు బెయిల్ మంజూరు..

బెంగళూరు: నటి రన్యారావుకు బెయిల్ మంజూరు..

by CVR NEWS

భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సినీ నటి రన్యా రావుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. గత ఏడాది కాలంగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటున్న ఆమె,విడుదల కానున్నారు. సుమారు రూ.102 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు నిందితురాలిగా ఉన్నారు. ఈ భారీ కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గతంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నిజానికి, రన్యారావుకు 2025 మే నెలలోనే ఈ కేసులో బెయిల్ లభించింది. అయితే, విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమెపై చర్యలు ఉండటంతో బెయిల్ వచ్చినా ఆమె విడుదల కాలేదు. గత దాదాపు ఏడాది కాలంగా ఈ చట్టం కారణంగానే ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా ‘కోఫెపోసా’ చట్టం పరిధిలోని నిబంధనల నుండి కూడా ఆమెకు ఊరట లభించడంతో, విడుదల మార్గం సుగమమైంది. నేడు జైలు నుంచి ఆమె బయటకు రానున్నారు. ఈ పరిణామం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: