Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

by CVR NEWS
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణమేర్పడింది. UAEకి చెందిన ఫుజైరా చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడులకు దిగింది ఇరాన్. ఈ భీకర దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గల్ఫ్‌పై ఆధిపత్యం కోసం ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన ఫుజైరా పోర్ట్ సమీపంలోని రిఫైనరీని ఇరాన్ టార్గెట్‌ చేసుకుంది. బాంబు దాడుల ధాటికి రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు భారతీయ కార్మికులు మంటల్లో చిక్కుకుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. యూఏఈ కూడా తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039879
Total views : 201221

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: