దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2025 నవంబర్ 11న జరిగిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ 10 మంది నిందితులపై మొత్తం 7,500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ, మహరాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. 588 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన ఎన్ఐఏ..395కు పైగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశామని మరికొందరు నిందితులను పట్టుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ దాడుల వెనుక ఉన్న టెక్నాలజీని చూసి దర్యాప్తు సంస్థలే విస్తుపోతున్నాయి. కేవలం పేలుడు పదార్థాలే కాదు.. వాట్సాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. దీనికి మెడికల్ జిహాద్ అనే కొత్త పేరుతో రూపుదిద్దుకున్న కుట్రగా అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ దాడుల వెనుక ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ లింక్స్ కూడా ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.
ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..
20





Total views : 76019