Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

by CVR NEWS

పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన ఇది. ఇంట్లోకి చొరబడి మరీ బంగారం కోసం హత్య చేయడంతో.. ఈ ఘటన విశాఖ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణానా ఎవరొచ్చి ఘాతుకానికి పాల్పడతారో అన్న టెన్షన్ పుట్టిస్తోంది.
విశాఖలో పట్టపగలు దుండగుడు ఒక అపార్టుమెంట్‌లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయిన ఘటన ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

కేసు దర్యాప్తులో భాగంగా అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానంగా ప్రవేశించిన వ్యక్తిని గుర్తించారు. డాగ్ స్కాడ్‌తో గాలించగా పక్క వీధిలో ఓ గ్రూప్ హౌస్ వద్ద ఆగింది డాగ్ స్కాడ్. ప్రాధమిక ఆధారాలు ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, 40 ఫ్లాట్‌లు ఉన్న అపార్టుమెంట్‌ మొదటి అంతస్థులో పట్టపగలే హత్య జరగడం చూస్తుంటే మృతురాలికి తెలిసిన వారిపనే అయివుంటుందని పోలీసులు అనుమానించారు.. పోలీసు బృందాలు జల్లెడ పట్టగా వారి అనుమానమే నిజమైంది. తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఇంటి యజమానికి ఆ ఏరియాలోనే పక్క వీధిలో చిన్న షాపులు ఉన్నాయ్.. వాటిని అద్దెకు ఇచ్చారు. రాము అనే వ్యక్తి బార్బర్‌గా పనిచేసుకుంటానని ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న అతను మూడు నెలల నుండి అద్దె చెల్లించలేక పోతున్నాడు. ఇదే విషయమై ఓనర్ చాలా సార్లు షాప్ వద్దకు వచ్చి నిలదీయగా అవమానంగా భావించాడు. దీంతో కోపం పెంచుకున్నాడు.. యజమానురాలు బంగారంపై కన్నేశాడు.. నేరుగా ఇంటికి వెళ్లి అద్దె విషయమై గొడవకు దిగాడు. గొంతు నులిమి హత్య చేశాడు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతు ఉన్న రాముకి మృతురాలి ఒంటిపై నగలు కనబడడంతో బంగారాన్ని కాజేశాడు. నగదు ఉంటుందని భావించి లాకర్‌ తెరవడానికి ప్రయత్నించాడు. తాళాలు వేసి ఉండడంతో వీలుపడక దొరికిన బంగారు ఆభరణాలతో పారిపోయాడు.
చేతికి చిక్కిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలతో హైదరాబాద్ చెక్కేయడానికి ప్లాన్ వేసాడు. ఇక్కడే ఉంటే దొరికిపోతాననే భయంతో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. రైలు ఎక్కి పారిపోవడానికి సిద్దంగా ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు. దోచుకున్న సొత్తును రికవరీ చేసుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197050

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: