Sunday, August 30, 2026
News Navigation
Sunday, August 30, 2026
News Navigation

Breaking

Sunday, August 30, 2026
Home Latest News ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.

ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.

by CVR NEWS

ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్‌ పోస్టెన్‌ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్‌ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి కాప్షన్‌గా ఓ తెలివైన, విసిగించే వ్యక్తి అని పేర్కొంది. అంతే కాదు.. భారత విదేశాంగ విధానంపైనా సదరు ఆఫెన్‌ పోస్టెన్‌ పత్రిక అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీ సోమ, మంగళవారాల్లో నార్వేలో పర్యటించారు. ఈ కార్టూన్‌ మాత్రం ప్రధాని నార్వేకు వెళ్లేకంటే ముందే ప్రచురించారని సమాచారం. నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని ఉన్న సమయంలో ఈ కార్టూన్‌ వెల్లడైంది. ప్రస్తుతం ఈ కార్టూన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. జాత్యహంకారానికి సదరు కార్టూన్‌ చిహ్నమని నెటిజన్లు మండిపడుతున్నారు. యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమ నుంచి బయటపడలేకపోతున్నారంటూ మరో నెటిజన్‌ ఫైర్‌ అయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: