Thursday, May 21, 2026
News Navigation
Thursday, May 21, 2026
News Navigation

Breaking

Thursday, May 21, 2026
Home Latest News నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ..

నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ..

by CVR NEWS
నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ

తమిళనాడులో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమయ్యింది. టీవీకే అధినేత విజయ్ తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తనతో పాటు మొత్తం 10 మంది మంత్రులు మాత్రమే తొలిరోజు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మిగిలిన మంత్రుల్ని కూడా తీసుకునేలా నేడు కేబినెట్ విస్తరణ చేయనున్నారు. తమకు మద్దతిస్తున్న పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించాలని విజయ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాన మితపక్షం కాంగ్రెస్ కు 2 బెర్తులు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చుకుంది. వీరిలో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార, పి.విశ్వనాథన్‌లను తమిళనాడు మంత్రివర్గంలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వీరంతా నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015181
Total views : 81759

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.