Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్ …

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్ …

by CVR NEWS
మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్ట్

రెవెన్యూ శాఖలో మరో అవినీతి అధికారి గుట్టురట్టు అయ్యింది. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వంశీమోహన్‌ పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు. వంశీమోహన్ ఇల్లు, ఆఫీసులతో పాటు 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. వనస్థలిపురం ఎన్‌‌జీవోస్‌‌ కాలనీలోని ఆయన ఇల్లు, మేడ్చల్‌‌ కలెక్టరేట్‌‌లోని ఆయన ఛాంబర్‌‌‌‌ సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మొత్తం 6 కోట్ల 22లక్షల విలువ చేసే స్థిర, చరాస్తులను సీజ్ చేశారు. వీటి విలువ మార్కెట్‌లో 100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌‌‌‌ మెట్‌‌ మండలం పిగ్లీపూర్‌‌‌‌లో తన మామ పేరిట ఫేక్​ రిజిస్ట్రేషన్‌‌ చేసిన 8 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వంశీమోహన్​ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వంశీమోహన్ ఇంట్లో తన మామయ్య పేరిట ఉన్న 25 ఖాళీ దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో రెండున్నర లక్షల నగదు, 122 గ్రాముల బంగారు నగలు, 32 లక్షల విలువ చేసే రెండు కార్లు సీజ్ చేశారు. బ్యాంకు అకౌంట్‌‌లో 20 లక్షలు ఫ్రీజ్ చేశారు. వీటితో పాటు 4.42 కోట్ల రూపాయల విలువ చేసే 19 ఓపెన్ ప్లాట్స్‌‌, మణికొండలో రూ.1.12 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నం నర్రెపల్లిలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో రూ.10 లక్షలు విలువ చేసే ఫామ్‌‌హౌస్‌‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వంశీమోహన్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌కు తరలించారు ఏసీబీ అధికారులు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019158
Total views : 90033

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.