సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులను చేధించారు అమీన్పూర్ పోలీసులు. గత నెల 14వ తేదీన బంధం కొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్ లో వెంకటరమణ భవాని అనే ఇంట్లో 50 లక్షల విలువ చేసే అరకేజీ బంగారాన్ని దొంగలించాడు మహబూబ్ నగర్ కు చెందిన శివ.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును 15రోజుల్లోనే ఛేదించారు పోలీసులు ..నిందితుని రిమాండ్ కు పంపి బాధితులకు బంగారాన్ని అప్పజెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు పోలీసులు పలు సూచనలు చేశారు. దొంగతనాల నివారణకు కాలనీలలో సిసి టీవీని కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బయటికి వెళ్లినప్పుడు బయట లైటు వేసి ఇంట్లో ఉన్న నగదును తెలిసిన వాళ్ల కు లేదా.. లాకర్ల లో పెట్టి జాగ్రత్త పడాలని అన్నారు. ఇంటికి ఖచ్చితంగా సెంటర్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.హిల్ టాప్ హోమ్స్ కాలనీలో అతి తొందరలో సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
దొంగతనాలను అదుపుచేసేందుకు పకడ్బందీ చర్యలు..
136
previous post




Total views : 212530