ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తమ ఫోన్‌లను పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ సపోర్ట్ పేరుతో నకిలీ SMSలు పంపి, బాధితులను భయపెట్టి ఫేక్ లింక్‌లపై క్లిక్ చేయిస్తున్నారు. ఆ లింక్‌లు అచ్చం యాపిల్ లేదా ఐక్లౌడ్ అధికారిక పేజీల మాదిరిగానే కనిపిస్తాయి. వినియోగదారులు తమ ఆపిల్ ఇది , పాస్‌వర్డ్, ఓటీపీ నమోదు చేసిన వెంటనే అకౌంట్లు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతున్నాయి. దీంతో “ఫైండ్ మై ఐఫోన్ ” ఫీచర్ పనిచేయకుండా చేసి, ఫోన్‌ను రీ సేల్ చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలకు అసలైన రక్షణ అప్రమత్తతే అని అధికారులు అంటున్నారు . అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఒక చిన్న SMS… ఒక నకిలీ లింక్… ఒక OTP… ఇవే ఇప్పుడు భారీ సైబర్ మోసాలకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కొత్త హైబ్రిడ్ సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముందుగా దొంగిలించిన లేదా పోగొట్టుకున్న ఫోన్‌ల వివరాలు సేకరించి, ఆ యజమానులకు “మీ ఫోన్ ట్రేస్ అయింది” అంటూ సందేశాలు పంపుతున్నారు. అందులో ఇచ్చే లింక్‌పై క్లిక్ చేస్తే ఫేక్ ఐక్లౌడ్ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. బాధితులు తమ వివరాలు నమోదు చేస్తే హ్యాకర్లు అకౌంట్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారు. అనంతరం యాక్టివేషన్ లాక్ తొలగించి ఫోన్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ మోసంతో వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారం, ఈమెయిల్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారిక ఐ క్లౌడ్ ఫైండ్ మై ఆఫీసియల్ పేజీ ద్వారానే ఫోన్‌ను ట్రాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు టెక్నాలజీతో పాటు మనుషుల భావోద్వేగాలను కూడా ఆయుధంగా మార్చుకుంటున్నారు. “మీ ఫోన్ దొరికింది”, “మీ డేటా డిలీట్ అవుతోంది” అంటూ వచ్చే సందేశాలు చూసి చాలామంది భయంతో వెంటనే స్పందిస్తున్నారు. ఇదే హ్యాకర్లకు కలిసొస్తున్న అవకాశం . కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం… యాపిల్ సపోర్ట్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌లు ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే SMSలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ OTPలను ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేస్తున్నారు. అలాగే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాలని సూచిస్తున్నారు. ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయించాలని చెబుతున్నారు. సైబర్ భద్రతలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో కీలక భాగంగా మారింది. అలాంటి సమయంలో ఫోన్ పోగొట్టుకోవడం అంటే కేవలం ఒక డివైజ్ కోల్పోవడం కాదు… వ్యక్తిగత సమాచారం మొత్తం ప్రమాదంలో పడినట్లే. ఇప్పుడు అదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఐఫోన్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొత్త తరహా హ్యాకింగ్ మోసాలు పెరుగుతున్నాయి. నకిలీ యాపిల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆపిల్ ఐడీ వివరాలు సేకరించి, బాధితుల అకౌంట్లను పూర్తిగా హ్యాక్ చేస్తున్నారు. దీంతో ఫోన్‌ను ట్రాక్ చేయడం అసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద లింక్‌లను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదని అధికారులు చెబుతున్నారు . అధికారిక ఆపిల్ ఆఫీసియల్ వెబ్సైటు , ఐక్లౌడ్ సేవలను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది మరి జాగ్రత్త సుమీ .




Total views : 90034