Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Film మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం..

మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం..

by CVR NEWS
మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో నేరుగా రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం నిర్వహించారు.
పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చొరవ తీసుకున్నారు. ఎగ్జిబిటర్లతో గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం దిల్ రాజ్ మాట్లాడుతూ.. “సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు ఇన్ని ఉన్నాయాఅని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యలన్నీ సమసిపోతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఇండస్ట్రీ సమస్యలకు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కూడా ఒక లైన్ క్లియర్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం భేటీ కానుంది. ఏపీలో చిత్ర పరిశ్రమ, థియేటర్ల వ్యవస్థ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు వినతిపత్రం సమర్పించనున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019315
Total views : 90326

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.