Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు..

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు..

by CVR NEWS
తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ముఖంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు బలమైన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్న నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు రికార్డయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాత్రంతా భారీ వాన కురిసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020002
Total views : 92039

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.