అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమెపై ఫైరైన ఆయన..చేతిలోని మైక్రోఫోన్‌ను నేలపై విసిరి కొట్టి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యమవడంపై మాట్లాడిన ట్రంప్..నాలుగైదు రోజులు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదని.. ఎందుకంటే వారు ఎన్నికల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై”మీ ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా?” అని యాంకర్ ప్రశ్నించడంతో.. “నేను చూడటమే ఆధారం, ప్రజలు చెప్పేది వింటున్నానని సమాధానమిచ్చారు. అయితే, అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, పదేపదే స్పష్టమైన ఆధారం చూపాలని కోరడంతో ట్రంప్ సహనం కోల్పోయారు. యాంకర్‌పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నన్ను క్షమించు..నీ పని నువ్వు చేసుకో” అని తన మైక్రోఫోన్‌ను తీసి నేలపై పడేసి వెళ్లిపోయారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లైవ్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రచ్చ.
167
previous post