Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.

ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు.

by CVR NEWS
ఏపీలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్షేమ శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ప్రస్తుతం ఉన్న మెస్ ఛార్జీలపై 10 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పెరిగిన ఈ మెస్ ఛార్జీలు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి అమల్లోకి రానున్నాయి. మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 500 కోట్లు మంజూరు చేసింది. ఇకపై కేవలం హాస్టళ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా, మెరుగైన వసతులతో కూడిన గురుకులాలనే నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రస్తుతం ఉన్న హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతుల కోసం 100 కోట్లు కేటాయించారు

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

039136
Total views : 194402

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: