10
గుడివాడ రూరల్ మండలం మోటూరు సబ్ స్టేషన్ ప్రాంగణంలో రూ.1.16 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఎం.వి.ఏ అదనపు ట్రాన్స్ ఫార్మర్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే రాముకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. కోటి 16 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఎం.వి.ఏ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ నూతన ట్రాన్స్ఫార్మర్ తో ఐదు గ్రామాల పరిధిలోని 2600 పైగా గృహాలు, 450 పైగా ఆక్వా మరియు వాణిజ్య కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు.






Total views : 194357