32
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం పేరుతో సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తంగుడు శ్రీధర్, దాదాపు రూ.80 లక్షలతో పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది . ఈ ఘటనతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.





Total views : 194514