Wednesday, July 15, 2026
News Navigation
Wednesday, July 15, 2026
News Navigation

Breaking

Wednesday, July 15, 2026
Home Crime బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.

బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.

by CVR NEWS
బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఒక రద్దీగా ఉండే పబ్‌లో ఒక్కసారిగా అంటుకున్న భారీ మంటల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికి వరకు 27 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అలాగే మంటల్లో చిక్కుకుని గాయపడిన మరికొంత మందిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించామని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని వెల్లడించారు. పబ్‌లో మంటలు చెలరేగడానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040416
Total views : 207701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: