Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.

శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.

by CVR NEWS

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పలాసలో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన కుమారుడు ఆరవ్ పాల్గొన్న రోడ్డు ప్రమాదం కేసు నుంచి అతడిని తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత కేసు నుండి తన కుమారుడిని రక్షించేందుకు, ఆధారాలను మరియు సాక్ష్యాలను తారుమారు చేయడానికి అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి అప్పలరాజు కుమారుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ నిమిత్తం అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: