46
ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో రైళ్లు మారేందుకు ఇంటర్‌చేంజ్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్ల గేట్లు కూడా మూసివేశారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని డీఎంఆర్‌సీ సూచించింది.