దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరిస్తే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ..ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థుల నిరసనలకు తీవ్ర నిరసన జ్వాలలు తోడవడంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో మంత్రి రాజీనామా బాట పట్టక తప్పలేదు.
గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని.. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా చేసినట్లు ట్వీట్ చేశారు. యువత తమ చదువుల కోసమే సమయం కేటాయించాలని.. మంత్రిగా ఇన్నాళ్లు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలని ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై సీజేపీ స్పందించింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన అభిజీత్ దీప్కే, ఆ పార్టీ సభ్యులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై హర్షం వ్యక్తం చేశారు. 36 రోజులుగా విద్యార్థులతో కలిసి తాము చేస్తోన్న పోరాటం ఫలించిందని, కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు. కాక్రోచ్ లు గెలిచాయని, ప్రజాస్వామ్యానిదే గెలుపయిందని ఆనందించారు. ఈ పోరాటంతో తాము ఎవరికీ హీరోలు కావాలని అనుకోలేదని, కేవలం విద్యార్థుల కోసమే పోరాడామన్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదని, తమ పోరాటానికి దక్కిన గొప్ప విజయం ఇది అని స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరికి వారే హీరో అని, ఈ పోరాటంలో భాగమైన ప్రతి విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు. ఎండనకా, వాననకా ప్రతిరోజూ పోరాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.