Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ

సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ

by CVR NEWS

సరిహద్దు గ్రామాల అభివృద్ధే దేశ భద్రతకు, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్–2026లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని.. సరిహద్దు గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా మొదటి గ్రామాలుగా తమ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దేశంలో తొలి సూర్యకిరణం పడేది, చివరి కిరణం వీడ్కోలు చెప్పేది ఈ గ్రామాలకేనని, త్రివర్ణ పతాకం గాలితో తొలిసారి సంభాషించేది కూడా ఈ ప్రాంతాల్లోనేనని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత తొలిసారిగా విద్యుత్, రహదారులు, తాగునీరు, గ్యాస్ కనెక్షన్లు వంటి మౌలిక సదుపాయాలు ఈ గ్రామాలకు చేరాయని చెప్పారు. మెరుగైన రవాణా, ఇంటర్నెట్ సౌకర్యాలతో రైతులు, ఉద్యానవన రైతుల ఉత్పత్తులు సులభంగా మార్కెట్లకు చేరుతున్నాయని అన్నారు.సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఒకప్పుడు వెలవెలబోయిన గ్రామాలు ఇప్పుడు మళ్లీ ప్రజల రాకపోకలతో కళకళలాడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: