Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.

యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.

by CVR NEWS

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తుల సౌకర్యార్థం అదనంగా ఆర్టీసీ బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య పెరిగిందని బీర్ల ఐలయ్య తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: