Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home International H-1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.

H-1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.

by CVR NEWS

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త ప్రతిపాదన చేసింది. ఉద్యోగం పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికా నుంచి తిరిగి వెళ్లేందుకు ఇస్తున్న రెండు నెలల గడువును రద్దు చేసే దిశగా ప్రతిపాదన వచ్చింది. ఈ మార్పు H-1Bతో పాటు L-1, O-1, TN వంటి ఇతర వర్క్ వీసాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు ప్రతిపాదించినట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. విదేశీ ఉద్యోగులను త్వరగా భర్తీ చేసుకునే అవకాశం తగ్గితే.. కంపెనీలు అమెరికన్లను నియమించుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, కుటుంబాన్ని తరలించడం, ఇల్లు-పిల్లల చదువులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం వారికి పెద్ద సవాలుగా మారనుంది.

అయితే ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు కాలేదు. తాజా ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజలు, కంపెనీల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత వచ్చిన సూచనలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులతో పాటు అమెరికాలో H-1Bపై ఆధారపడిన కుటుంబాలు, కంపెనీలపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: