Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home International బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.

by CVR NEWS

బ్రిక్స్ సదస్సు-2026 నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌కు ఒక విశిష్టమైన సాంస్కృతిక కానుకను అందజేశారు. ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథమైన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని ఆయనకు బహూకరించారు. సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరస్పరం కరచాలనం చేసుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు సమాచారం.

ప్రధాని మోదీ బహూకరించిన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్య, గౌరవం పొందిన గ్రంథాల్లో ఒకటి. దీనిని సుప్రసిద్ధ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించారు. ఇందులో నీతి, నైతికత, ప్రేమ, సంపద, పాలన, మానవ ప్రవర్తన వంటి అనేక అంశాలపై 1,330 పద్యాలు ఉన్నాయి. ఈ గ్రంథం అర్థవంతమైన, నైతిక జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేసే మార్గదర్శిగా ప్రసిద్ధి చెందింది. ఇందులోని అంశాలు సార్వత్రికమైనవి కావడంతో, భాష, సంస్కృతి, దేశాల సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటికే అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడిన ఈ గ్రంథం రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందించడం ద్వారా, విశ్వమానవ విలువలను చాటిచెప్పే భారతీయ సాహిత్య వారసత్వాన్ని నరేంద్ర మోదీ ఆయనకు పరిచయం చేసినట్టయింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: