Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.

by CVR NEWS

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్‌పై అసెంబ్లీకి చేరుకున్న పాయల్ శంకర్.. రాష్ట్రంలో రైతులకు పంట బీమా అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేంద్ర ఫసల్ బీమా పథకంలో ఖరీఫ్ పంటలకు రైతులు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యానవన పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించే విధానం ఉందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టాల సమయంలో రైతులకు ఈ పథకం భరోసాగా నిలుస్తుందని అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని పాయల్ శంకర్ ఆరోపించారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందనే కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: