Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News కొండా సురేఖకు బుజ్జగింపులు.

కొండా సురేఖకు బుజ్జగింపులు.

by CVR NEWS

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవల పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రీయాశీలకంగా మారాలని కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆమె సూచించారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండా సురేఖ సభకు గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలే తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు. కేబినెట్‌ నుంచి కొండా సురేఖను తొలగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆమోదించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: