Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home International ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.

by CVR NEWS

ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మంది అధికారులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది. ఢిల్లీ చేరుకున్న అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భారత్‌–చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా భారత్‌, చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: