ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏపీలో 22 ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా, మెరుగ్గా అందించేందుకు ఎమర్జెన్సీ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 9 క్రిటికల్ కేర్ యూనిట్లను కేంద్రమంత్రి నడ్డా వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టారు.
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
12
previous post