కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం 14వ వార్డు నూకాలమ్మ ప్రక్క వీధిలో యండి.రాజు అనే ఫాస్టర్ తన ఇంటిని చర్చ్ గా మార్చి, రాత్రనకా పగలనకా ప్రార్ధనల పేరుతో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో నివాస స్థలాల మధ్య ఉన్న కుటుంబాలకు విపరీతమైన భంగం కలిగించడమే కాకుండా, హిందూ దేవుళ్ళను తిడుతూ, భయంకరంగా అరుస్తూ ఏడుస్తుంటే చుట్టు పక్కల వారు భయంతో, మాకు పిల్లల చదువులు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారని కాస్త సౌండ్ తగ్గించమని చెప్పిన, వీళ్లను బెదిరిస్తూ, మీరు మా మతం లోకి మారకపోతే మీరు నాశనమోతారని బెదిరిస్తుంటే, ఎన్నో సార్లు అధికారులకు కంప్లైంట్ చేసిన, వీరి బాధను తీర్చడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. చర్చ్ ప్రక్కనే నివశిస్తున్న ఒక వ్యక్తికి వీరు చేస్తున్న అసందర్భ కార్యకలాపాల వలన పెరాలసిస్ కి గురవ్వడం జరిగింది అని అంటున్నారు. ఈరోజు శుక్రవారం స్థానిక హిందువులు తమ ఆవేదనను పోలీసులకు ఫిర్యాదు చేశారు, అక్కడి హిందువులు అందరూ మా వేదనను గుర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాకు చావే శరణ్యం అని వారి వేదన తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావు హిందూ, సురేంద్ర దత్త కి ఫోన్ చేసి తెలియజేయగా, హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి హిందువులకు అండగా నిలిచి, వారి మనోవేదనను అధికారులతో మాట్లాడి, ఆ అక్రమ చర్చిని సీల్ చేసి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు.
రాత్రనకా పగలనకా ప్రార్ధనలతో ఇబ్బంది పెడుతున్న పాస్టర్..
62
previous post