28
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి మండలం తగరపువలసలో గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కన కారు ఆపి ముఖం కడుగుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం పండును ఢీకొట్టి కారును కూడా గుద్దింది. ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Total views : 92036