ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తి కావడంతో ఈ టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన వస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గాలేరు నగరి వరద కాలువ నిర్మాణంలో భాగంగా అవుకు రిజర్వాయర్ సమీపంలో రెండు టెన్నల్ ల నిర్మాణానికి అప్పటి వైయస్ ప్రభుత్వం 2008 లో శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కొక్కటి ఆరు కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను 436 కోట్లతో నిర్మించారని కాటసాని రామిరెడ్డి తెలిపారు. టన్నెల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
Karnool
శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది. సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది, అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ రాజకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గో ఉత్పత్తి కేంద్రం వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజ పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అటవీప్రాంతంలో పామును వదిలిపెట్టారు.
నంద్యాల జిల్లా డోన్ మండలంలో సాధారణ వాహన తనికీల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్ ఆంధ్ర ప్రదేశ్ కు కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండటంతో గుర్తించి వాహనానికి 404500/- జరిమానా విధించి బస్ ను సీజ్ చేయడం జరిగినది అన్ని డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక మినీ బస్ 265500/- జరిమానా వేసి సీజ్ చేయడం జరిగినది గత మూడురోజుల లో రెండు బస్సులకు గాను 670000/- జరిమానా విధించటం జరిగినది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220/132/33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని, ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని,ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా,దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు.
నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ ఆనందం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గాలు… అయితే మరి కొంత మంది మైనారిటీలో, ఫరూక్ వ్యతిరేక వర్గంలో మరో చర్చ మొదలైంది అని చెప్పొచ్చు. 2004 లో శిల్పా మోహన్ రెడ్డి తో, 2024 లో శిల్పా రవి తో ఓడిపోయి చరిత్ర సృష్టించనున్న మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అంటూ మైనార్టీ వర్గాల్లో చర్చ.మేము తెలుగుదేశం అభిమానులము , మైనార్టీలమే కానీ మనసు చంపుకొని ఫరూక్ కు వేయము,ఇతర పార్టీకి ఓట్లు వేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి వర్గంలో కలకలం తారాస్థాయికి చేరుకుంది ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు టికెట్ లేదంటే బాబు నిన్ను నమ్ముకున్న నాకు షూరిటీ లేకుండా పోయిందని భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం వాపోతున్నారు… నంద్యాల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగానైన ఒంటరిగా బరిలోకి దిగుతానని బ్రహ్మానంద రెడ్డి వర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన వెలిబుచ్చారు భవిష్యత్తులో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు ఈ శిబిరాలలో జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది మద్యాహ్నం నుంచి కొన్ని గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు దోర్నాలకు వెళ్లె ఘాట్ రోడ్డులోని నాలుగు కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ జామ్ జరిగి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్తీక పౌర్ణమి పైగా సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు ఆంద్రా తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల క్యూసెక్కులను తరలించవచ్చు అని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని మహోన్నత సంకల్పాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తుండడం ఈ ప్రాంత వాసుల ఆనందానికి వెలకట్టలేనిది అని చెప్పారు.
కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హామీలనూ నెరవేర్చలేదని మండిపడ్డారు.
Read Also..
Read Also..
శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పంటించిన ఘటన వెలుగుచూసింది. ఈ మంటల్లో
మత్స్యకారుల చెందిన రెండు బైకులు పూర్తిగా దగ్ధమైనవి దీనితో లింగలగట్టు మత్స్యకారులు బైకులు దగ్ధంపై సుండిపెంట పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్దలానికి చేరుకుని దగ్ధమైన బైకులను పరిశీలించి సుండిపెంట పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేస్తున్నారు తెల్లవారుజామున రెండు బైకులు మంటల్లో దగ్ధం కావడంతో లింగాలగట్టు మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గతంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో భాగంగా కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.





Total views : 81812