కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే నిజాయితీగా ఉంటూ, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. అలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Karnool
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజాబలంతో ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు. నా కొడుకు కూడా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ గా వచ్చి సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం కు చేరుకున్నారు. ర్యాలీలో ప్రస్తుతం కరువుతో రైతులు పడే కష్టాలు ఎద్దుల బండి కాడమోసి రైతు ఆత్మహత్య చేసుకునే దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ఈ కరువు తో వలసలు వెళుతు, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంత కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు. ఆ ట్యాబ్ ల వల్ల అసభ్యకర వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే లు కుడా అసభ్యకర వీడియోలు చూస్తున్నరన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికి ట్యాబులు, లాప్టాప్ లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పోటీపడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.
శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి. దీనితో నీటి కుక్కల కళ్ళను చూపుర్లను కట్టిపడేస్తున్నాయి. నీటి కుక్కలు ముఖ్యంగా ఎగువన వర్షాలు పడినప్పుడు నీళ్లు పెరిగిన, లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గిన శ్రీశైలం జలాశయం పరిసరాలలో చేపల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి. అలానే ప్రతి సంవత్సరం శ్రీశైలం పాతాళగంగలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసుకున్న జెట్టుపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. నీటి కుక్కలు సాధారణంగా మనిషి కనపడిన శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో నీటి కుక్కలు శ్రీశైలంలోని పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర టూరిజం శాఖ జెట్టుపై ఒక్కసారిగా ప్రత్యక్షమై కనపడంతో యాత్రికులకు కనువిందు చేసాయి. అయితే యాత్రికులు సైతం తమ సెల్ ఫోన్ లో నీటి కుక్కల సందడిని చిత్రీకరించారు. నీటి కుక్కలు పాతాళగంగకు వెళ్లే వారికి వీటిని చూస్తూ ఆనందంతో పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయోత్సవ ర్యాలీలో ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ కు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అడుగడుగునా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథం పై మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.కొల్లాపూర్ పట్టణంలో దారి పొడవున ప్రజలు మంత్రి జూపల్లి కృష్ణారావు పై పూల వర్షం కురిపించారు.పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు కొల్లాపూర్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కొల్లాపూర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడించారు.కొల్లాపూర్ ను అన్ని రంగాలలో తన శక్తి వంచన లేకుండా తన చేతనైనంత పని చేస్తానాని నా వంతు కృషి చేస్తానాని హామీనిచ్చారు.నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కొల్లాపూర్ ప్రజలకు సేవ చేస్తానాని తెలిపారు.
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేసి వెంకటేష్ ని అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లిపోవడంతో కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు మోటార్ సైకిల్ సహాయంతో రోడ్డు మార్గంలో ఉన్న ప్రొటెక్షన్ సెంటర్ వద్దకు వెంకటేష్ చేరుకోగా, తీవ్రంగా రక్తస్రావ గాయలతో ఉన్న వెంకటేష్‌ను హుటాహుటిన సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ కు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తున్న అటవీశాఖ అధికారులు వైద్యులు తెలిపారు.
సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన కొకల ప్రసాద్ నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున సెక్యూరిటీ, వైద్య సిబ్బంది ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు కోకల ప్రసాద్. కొద్దిసేపు వార్డులన్నీ నిశితంగా పరిశీలించాడు. అనంతరం స్ర్తీల మెడికల్ వార్డులోకి ప్రవేశించి తాను వైద్యుడనని. రోగులకు పరీక్షలు చేయాలని అటెండర్స్ ను బయటికు పంపించాడు. తర్వాత పేషంట్ల కేసు షీట్లను. తీసుకొని రోగుల వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ, మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటిని ప్రశ్నించిన ఓ రోగి భర్తపై ఆగ్రహంతో బయటకి పంపించేశాడు ఫేక్ డాక్టర్ ప్రసాద్. అనుమానించిన వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని నిలదీశారు. కానీ తాను డాక్టర్ నని బుకాయించాడు ప్రసాద్. దీంతో ఆస్పత్రి సిబ్బంది అంతా కలిసి అతన్ని చితకవాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. 4రోజుల జైలు శిక్ష విధించారు మెజిస్ట్రేట్ రాంభూపాల్ రెడ్డి. వెంటనే అతన్ని పోలీసులు నంద్యాల సబ్ జైలుకు పంపించారు.
అవుకు పట్టణం బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అవుకు మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ అవుకు మండలంలో అత్యధిక ఓట్ల శాతం కలిగి ఉన్న బలిజ సంఘం రాజకీయాల్లోకి రావాలని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. బలిజ సంఘాల కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో కళ్యాణమండపం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే అత్యధికంగా ఇంటి స్థలాలు భూ పంపిణీ కార్యక్రమంలో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. త్వరలోనే ఇంటి స్థలాలతో పాటు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరని ప్రజలు గుర్తించాలని అలాంటి వ్యక్తులకే 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని చెప్పారు.
కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్నా మారెప్ప, రత్నమ్మ ల రెండో కుమార్తె అయినా కృష్ణవేణి(7) ఇంటిలో తాగునిటీ కోసం ఊరి దగ్గర లో ఉన్న నీటి ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆ ట్యాంక్ లో నీరు అడుగున ఉండటంతో ఓ తాడు సహాయంతో పైకి నీటిని తోడుతుండగా ప్రమాదవాషత్తు కాలు జారీ ఆ నీటి ట్యాంక్ లో బాలిక పడిపోయింది. ఆ బాలిక అరుపులు విన్న వెంటనే పక్కన ఉన్న కొంతమంది వెళ్లి ఆ నీటి ట్యాంక్ లో ఉన్న బాలిక కృష్ణవేణి ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వం ఆసుపత్రికు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షంచగ బాలిక కృష్ణవేణి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆ బాలిక మృతితో ఆ గ్రామం మొత్తం విషాదచయాలు అలుముకున్నాయి. ఘటనపై నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






Total views : 195647