నలుగురు కొత్త న్యాయమూర్తుల రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జడ్జిలు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ అందుబాటులోకి రావడంతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమూల మార్పులు చేశారు. సీనియర్ న్యాయమూర్తుల పక్కన కొత్తవారికి స్థానం కల్పించారు. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించారు. 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిటిషన్లను కూడా ఆయనే పరిశీలించనున్నారు. ఇక కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి కేటాయించారు. ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ 2022 తర్వాత దాఖలైన వ్యాజ్యాలను భానుమతే విచారిస్తారు. జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన కేసులను అప్పగించారు. ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, రెవెన్యూ, భూసేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవిలకే కేటాయించారు. ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ఇకపై ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లను కొట్టివేయాలంటూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లపై పరిశీలించనున్నారు. అంతేకాదు 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను ఆయనే విచారిస్తారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను అప్పగించారు. ఇప్పటివరకు క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసుల బాధ్యతలు కేటాయించారు. కాగా ఈ రోస్టర్లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ ట్రాన్స్ఫర్పై వేరే హైకోర్టులకు వెళ్తుండడమే ఇందుకు కారణంగా ఉంది. మరోవైపు కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ జీ.నరేంద్ర బదిలీ ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తాజా రోస్టర్లో కొన్ని మార్పులు అనివార్యం కానుంది.
Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో భారీ వర్షం కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అకాల వర్షంతో ప్రయాణికులు, మార్కెట్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నరసాపురం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని.. నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ కి ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని, నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఎంపి మార్గాని మాటలను ఖండించారు. తిరుమలలో జగన్ మోహన్ కి భజన చేయడం మంచి పద్దతి కాదని తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా టిటిడి చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంగురాళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అదునుచూసి అధికారుల కళ్ళుకప్పి రంగురాళ్ల కొండలను రంగురాళ్ల వ్యాపారులు తవ్వేస్తున్నారు.అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సిగినాపల్లి కొండపై జోరుగా రంగురాళ్ల క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కోట్లల్లో వ్యాపారం జరిగిందని, ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వుంటుంన్నారని స్థానికులంటున్నారు. నర్సిపట్నం, చింతపల్లికి చెందిన రంగురాళ్లు వ్యాపారులు అమాయకులైన పేద గిరిజనులకు మద్యం,డబ్బులు ఇచ్చి రంగురాళ్ల కొండపైకి ఎక్కించి తవ్విస్తున్నారు. వీరిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వాటిని సహితం లెక్కచేయకుండా రంగు రాళ్లు ఉన్న కొండలను తవ్విస్తున్నారని , వీరిపై నిరారంతరంగా నిఘా వుందని చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ సిహెచ్ సూర్యనారాయణ తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడి సెంటర్ కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేస్తున్న నిర్లక్ష్యం బట్టబయలైయింది. చిన్నపిల్లలకు,గర్భిణీలకు పౌష్టికాహారంగా గుడ్లను, పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం. అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లను , పిల్లలకు బాలింతలకు అందిస్తూ గుత్తేదారు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. కాసుల మత్తులో అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కుళ్ళిన గుడ్లతో బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు.. కుళ్ళిన గుడ్లు తింటే పిల్లలకు,గర్భిణీలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. కుళ్ళిన గుడ్లు సప్లై చేస్తున్న సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్ సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించండం వివాదంగా మారింది. ఇదే అంశంపై బొజ్జల సుధీర్ రెడ్డి..సీఐతో మాట్లేడేందుకు ప్రయత్నించగా. సుధీర్ రెడ్డి పై కూడా సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం మారింత తీవ్రంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున్న చేరుకున్న టీడీపీ శ్రేణులు స్టేషన్ ను ముట్టడించారు. సిఐ అజయ్ కుమార్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ బైఠాయించారు. తిరుపతి SP తో ఫోన్లో మాట్లాడి… సిఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి కి వినతి పత్రం అందజేశారు.
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చిన్న ముత్తెవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాశ్ 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కుటుంబసభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను ఆయుష్ హాస్పిటల్ నుండి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.గన్నవరం నుండి తిరుపతి లోని పద్మావతి హాస్పిటల్ కు తరలించారు.
ప్రకాశం జిల్లా దర్శి ఏ.పి.మోడల్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ కలకలంసృష్టించింది. కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ లో తిరుగుతున్న కొండ చిలువను గమనించి వైస్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. వెంటనే వైస్ ప్రిన్సిపాల్ మార్కాపురం చెందిన స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి నిరంజన్ తన బృందంతో చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు. అప్పటికి కొండ చిలువ కోడిని మింగేసింది.కొండ చిలువను పట్టుకోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.కొండ చిలువ సుమారు ఏడు అడుగులు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు. గ్రహణకాలం అనంతరం ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము మరియు ఉపాలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నానాభిషేకములు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనము పునః ప్రారంభించబడుతుంది. ఆదివారం తెల్లవారు ఝామున నిర్వహించే ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చన నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమయ్యే అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయములో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని అందులోని 77. 159 కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన సూహైల్ పాషా,ఇమ్రాన్ అహ్మద్ లను అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు కారకుడైన బెంగళూరుకు చెందిన ముహమ్మద్ సూఫీయల్ అనే అతని పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఈబి అధికారులు తెలియజేశారు.



Total views : 203020