దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి. పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.. పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫైర్ నిబంధనలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. అయితే దీని మీద రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపడతామంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ని రంజన్ రెడ్డి తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్.
Vijayanagaram
దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలో యదేచ్చగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో పైర్ సేప్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు పెట్రోల్ బంకు పక్కన బాణసంచా అమ్మకాలు చేపట్టి స్తానికులను బయబ్రాతులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫైర్ నిబంధనలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారు. అయితే దీని మీద రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలకు తావులేకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ బంకు దగ్గర అమ్మకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని దానికి తగ్గట్టుగానే జాగ్రత్తలు తీసుకుంటామని రాబోయే రోజులు అక్కడ అనుమతులు ఇవ్వకుండా చర్యలు చేపడతామని సివిఆర్ న్యూస్ కు వివరించారు పర్మినెంట్ గా ఉన్నటువంటి క్రాకర్స్ అనుమతులకు సంబంధించిన షాపులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరలో వేరోక ప్లేస్ కి మారుస్తామనీ అంటున్న రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి.
Read Also..
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నెల 6న శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. గుండెలో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా.. శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో విజయనగరం వెళ్లే రహదారిలో భీమాలి వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని బొగ్గు లారీలు అధిక లోడలతో రవాణా చేయడమే కాకుండా కాలుష్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని…… కనీసం రోడ్లు బాగు చేసే దుస్థితి కూడా లేదని 15 రోజుల్లోగా రోడ్లు బాగు చేయకపోతే సిపిఎం నాయకులు తో పాటు ప్రజలు కూడా తిరుగుబాటు చేసి రహదారులను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, పీవీ రమణ సిపిఎం గాంధీనగర్ గ్రామ శాఖ కార్యద్దర్సీ, రైతు సంఘం నాయకులు కొంప రామకృష్ణ, తదితరులు పాల్గొన్నార.
విజయనగరంలో అడ్డగోలుగా బాణాసంచా విక్రయాలు జరుగుతున్నాయి. ఆర్గీఓ కార్యాలయం రోడ్డు, విశాఖ-రాయపూర్ హైవేను తమ అడ్డాగా వ్యాపారులు మార్చేసుకున్నారు. విక్రయదారులు కనీస నియమ నిబందనలు పాటించటం లేదు. కాసులకు కక్కుర్తిపడి ADFO అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. విజయనగరం RTO రోడ్డులో పెట్రోల్ బంక్ ప్రక్కనే బాణాసంచా విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, దుకాణాలకు మధ్యలో రెండడుగుల దూరం కూడా ఉండదు. కనీసం జిల్లా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. క్యాష్ కొట్టు దుకాణం పెట్టు అనే తీరులో ADFO వ్యవహరిస్తోంది.
ఫారెస్ట్ అధికారి ఇంటిలో ఏసీబీ సిఐయు అధికారులు సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14400 ఫిర్యాదులు. విజయవాడకు చెందిన అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో దాడులు. మాధవరావు భార్య పేరు మీద ఉన్న చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జి ప్లస్ టు హౌస్ బిల్డింగ్.. మాధవరావు పేరు మీద ఉన్న తిరుపతి అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల జి ప్లస్ ఫోర్ భవనం.. పుంగనూరు లోని వలపల వారి పల్లి గ్రామం వద్ద ఉన్న 242 చదరపు గజాల జి ప్లస్ వన్ భవనం. రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం,పుంగునూరు మండలం మిలిమి దొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల09 సెంట్ల వ్యవసాయ భూమి. తొండవాడ-1 పాత కాలువ -2 మెండగుంట -1 నిందిత అధికారి, అతడి భార్య పేరిట నాలుగు ఓపెన్ ప్లాంట్లు. స్థిరాస్తులు గుర్తింపు.. మారుతి కారు. (7 లక్షలు) రెండు ద్విచక్ర వాహనాలు.( 1 లక్ష) నగదు. 1,64,900/- బంగారం.1062 గ్రాములు.వెండి వస్తువులు.1.5 kg విలువైన గృహోపకరణాలు.20,51,000/- బ్యాంకు బ్యాలెన్స్ .4,00,000/-
చరాస్తులు గుర్తింపు… ఫిక్స్డ్ డిపాజిట్లు.8,00,000/- స్వాధీనం ఫారెస్ట్ అధికారి ఇంటిలో ఏసీబీ సిఐయు అధికారులు సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14400 ఫిర్యాదులు. విజయవాడకు చెందిన అధికారులు ఏకకాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి ఒకే సమయంలో దాడులు. మాధవరావు భార్య పేరు మీద ఉన్న చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జి ప్లస్ టు హౌస్ బిల్డింగ్.. మాధవరావు పేరు మీద ఉన్న తిరుపతి అవిలాల గ్రామంలో 305 చదరపు గజాల జి ప్లస్ ఫోర్ భవనం..పుంగనూరు లోని వలపల వారి పల్లి గ్రామం వద్ద ఉన్న 242 చదరపు గజాల జి ప్లస్ వన్ భవనం. రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం,పుంగునూరు మండలం మిలిమి దొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల09 సెంట్ల వ్యవసాయ భూమి. తొండవాడ-1పాత కాలువ -2 మెండగుంట -1 నిందిత అధికారి, అతడి భార్య పేరిట నాలుగు ఓపెన్ ప్లాంట్లు. స్థిరాస్తులు గుర్తింపు.. మారుతి కారు. (7 లక్షలు) రెండు ద్విచక్ర వాహనాలు.( 1 లక్ష) నగదు. 1,64,900/- బంగారం.1062 గ్రాములు.వెండి వస్తువులు.1.5 kg విలువైన గృహోపకరణాలు.20,51,000/- బ్యాంకు బ్యాలెన్స్ .4,00,000/- చరాస్తులు గుర్తింపు… ఫిక్స్డ్ డిపాజిట్లు.8,00,000/- స్వాధీనం
హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితమవకుండా జిల్లా అభివృద్ధిలో జగన్ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో బొడ్డవర సమీపంలో ఎస్ ఈ జెడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు జిల్లాకు రావటం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పారు…
చెరువుల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతనరోవర్ పథకంలో భాగంగా పార్వతీపురం పట్టణం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఈ పనుల్లో నాణ్యతలోపం కన్పిస్తుందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆరోపించారు. గురువారం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆయనతోపాటు టిడిపి నాయకులు, కౌన్సిల్ సభ్యులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ కోనేరు గట్టుపై నిర్మాణం చేపడుతున్న రోడ్డు కేవలం బూడిదతో కూడిన నాశిరకమైన గ్రావెల్ మాత్రమే అని, సైడు వేసిన సిమెంట్ దిమ్మలు కూడా నాణ్యతలోపమే నాణ్యమైన మెటీరియల్ కాదన్నారు. ఈ కోనేరు అభివృద్ధికోసం రూ.94లక్షల నిధులు మంజూరయ్యాయని ఈ నిధులను దుర్వినియోగం చేయడానికి మాత్రం తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై తక్షణమే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. మున్సిపల్ కమిషనర్‌ను కూడా సంప్రదిం చడం జరుగుతుందన్నారు.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి. మీడియా సమాచారంతో అక్కడకు చేరుకున్న వైద్యాధికారి ఆనంద్ వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన 14 ఎంఆర్ వ్యాక్సిన్ లను వైద్యాదికారి గుర్తించారు. పెదకాద గ్రామానికి చెందిన చిన్నారికి కాలం చెల్లిన వ్యాక్సిన్ వేసినట్లుగా గుర్తించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. హవ్డా-సికింద్రాబాద్ , ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హవ్డా-బెంగళూరు దూరంతో ఎక్స్‌ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ ప్యాసింజర్, తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్ ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇక భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌నూ రీషెడ్యూల్ చేశారు. నేటి ఉదయం 5:40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 10 గంటలకు వెళుతుందని చెప్పారు. రైలు ప్రమాదం నేపథ్యంలో నిన్న కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.




Total views : 61933