Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh అరకు కమలతోటలో గిరిజనుల ఆవేదన…

అరకు కమలతోటలో గిరిజనుల ఆవేదన…

by CVR NEWS
అరకు కమలతోటలో గిరిజనుల ఆవేదన

అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని మాదల పంచాయతీ కమలతోటలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల పరిస్థితి మరోసారి ప్రభుత్వ పథకాల అమలు పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా పిటిజిలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం వర్తించకపోవడం స్థానికుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ కుటుంబాలు ఇప్పటికీ ప్రాథమిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అధికారులు గ్రామానికి చేరుకుని పథకాల గురించి వివరించకపోవడం వల్ల, అర్హత ఉన్నప్పటికీ చాలా మంది గిరిజనులు లబ్ధి పొందలేకపోతున్నారు. పథకాలు కాగితాలపై మాత్రమే ఉండిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో అధికారులు ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిజమైన లబ్ధిదారులకు పథకాల ఫలితాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కమలతోట గ్రామంలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాలకు దూరంగానే ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ప్రాథమిక సర్వే కూడా నిర్వహించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో నివసిస్తున్న 9 కుటుంబాల్లో ఒక్కరికీ కూడా పీఎం జన్మన్ పథకం కింద ఇల్లు మంజూరు కాలేదని, అత్యంత వెనుకబడిన వర్గాలకు చేరాల్సిన పథకాలు కేవలం కాగితాలపైనే మిగిలిపోయాయని విమర్శిస్తున్నారు. మరోవైపు, మంచినీటి సదుపాయం లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం అడిగితే అధికారులు ‘ఇదిగో, అదిగో’ అంటూ కాలయాపన చేస్తున్నారని వారు వాపోతున్నారు. తమ గ్రామం అధికారుల దృష్టిలో ఉందా లేదా అన్న అనుమానంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039750
Total views : 200770

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: