Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh కోనసీమ జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఆందోళన.

కోనసీమ జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఆందోళన.

by CVR NEWS

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ పీడీఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్, సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎస్‌పీ ప్రజా సంఘాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆందోళనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందుకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూపెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా నీట్–యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా గత మూడు నెలలుగా విద్యార్థి, యువజన, కార్మిక, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు నిర్వహిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని పీడీఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్, సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎస్‌పీ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, పేపర్ లీకేజీ కి కారణమైన మాఫియాను కఠినంగా శిక్షించాలని .. పరీక్షల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకతను తీసుకురావాలని ప్రజా సంఘాలు నేతలు డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: