ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కార్యాచరణను వేగవంతం చేసింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో.. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు, పోలవరం పూర్తి లక్ష్యాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అలాగే 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని.. అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పుష్కరాల నిర్వహణతో పాటు రాజమహేంద్రవరాన్ని మెగాసిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి: గోదావరి పుష్కరాలు -2027 నిర్వహణపై సీఎం సమీక్ష…
334
previous post