Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..

అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి..

by CVR NEWS
అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసోంలో 126 స్థానాలకు గాను బీజేపీ కూటమి 80కి పైగా సీట్లు గెలుచుకుంటుందని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 30 సీట్లకే పరిమితం కానుంది. ఇతరులు 1 నుంచి 10 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి.126 సభ్యుల అస్సాం అసెంబ్లీలో మెజారిటీకి 64 స్థానాలు అవసరం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA 90 నుంచి 100 స్థానాల మధ్య గెలిచే అవకాశం ఉంది. మధ్యస్థ అంచనా ప్రకారం 95 సీట్లు రావొచ్చని తెలుస్తోంది. దీంతో బీజేపీ కూటమి సులభంగా అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ASM కూటమికి 23 నుంచి 33 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. AIUDF కు 0 నుంచి 6 స్థానాల మధ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా. మరోవైపు 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలోనూ ఎన్డీయే మెజార్టీకి కావాల్సిన సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, మిత్రపక్షాలు 16 సీట్లకు పైగా గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

 

Advertisements

You may also like

Our Visitor

027421
Total views : 152083

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.