Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Telangana తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే …!

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే …!

by Rama
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే …!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి? అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. డిసెంబర్ రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రైతుభరోసా విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇటు సర్వే సైతం ఈ నెల చివరి వరకు ముగియనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా ఏ మేరకు ఉందనేది క్లారిటీ వస్తుంది. అలాగే లోకల్ బాడీలో రిజర్వేషన్లు సైతం ఫైనల్ కానున్నాయి. సంక్రాంతి తరువాత లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉండడంతో ఈ లోపే రైతుభరోసా ఇచ్చి తీరాలనే టార్గెట్‌లో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్‌లో నుంచి రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
    కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
  • ‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!
    స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి…
  • విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..
    సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ…
  • ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..
    ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో…
  • రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..
    తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

008586
Total views : 56890

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.